మాన‌వ హ‌క్కుల సంక్షోభంగా మారుతోంది..

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా మాన‌వ హ‌క్కుల సంక్షోభం ఏర్ప‌డిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్ తెలిపారు.  వైర‌స్ విస్త‌రిస్తున్న తీరు చూస్తుంటే.. మాన‌వ సంక్షోభం కాస్త‌.. మాన‌వ హ‌క్కుల స‌మ‌స్య‌గా మారిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కోవిడ్‌19ను ఎదుర్కొనే క‌మ్రంలో ప్ర‌జాసేవ‌లో వివ‌క్ష జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న ఓ వీడియో సందేశంలో చెప్పారు. ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంలో అస‌మాన‌త‌లు క‌నిపిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు మొద‌టి ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు.మాన‌వ హ‌క్క‌లను గౌర‌వించ‌డం ద్వారా త్వ‌ర‌గా ఈ విప‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు అన్నారు.  వైర‌స్ మాత్ర‌మే మ‌న‌కు శ‌త్రువు అని, ప్ర‌జ‌లు కాద‌న్నారు. వైర‌స్ వ‌ల్ల అంద‌రికీ ప్ర‌మాద‌మే.. అందుకే అంద‌రం క‌లిసి పోరాడాల‌న్నారు.