బంగ్లాదేశ్ లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగించింది. ఏప్రిల్ 26 నుంచి మే 5 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కరోనా మహమ్మారి విస్తరించడంతో ముందుగా బంగ్లాదేశ్ సర్కారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 4 వరకు అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు జనరల్ హాలీడేస్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఏప్రిల్ 5 నుంచి 25 వరకు లాక్‌డౌన్ విధించింది. తాజాగా మరోసారి మే 5 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 3,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 120 మంది మరణించారు.
బంగ్లాదేశ్‌లో మే 5 వరకు లాక్‌డౌన్ పొడిగింపు