కరోనా వాష్‌ కరోనా.. గంటకొక్కసారి శానిటైజ్‌ షురోనా..

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై పలువురు సామాజిక అవగాహన కల్పిస్తున్నారు. కొందరు కవిత రూపంలో, మరికొందరు పాటల రూపంలో, ఇంకొందరు వినూత్నమైన వీడియోలను చిత్రీకరించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. పీవీఆర్‌ క్రియేషన్స్‌ వారు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ అద్భుతమైన పాటను చిత్రీకరించారు. లిరిక్స్‌ గడ్డం వీరు రాయగా, ప్రశాంత్‌ కీస్‌ ఆలపించారు. ఈ పాటకు నిర్మాతలు రత్నాకర్‌ కడుదూల, మద్ది వాలేరు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరోనా బందూ కరోనా.. నడిరోడ్డు మీద ముచ్చట్ల కిరాణా.. కరోనా వాష్‌ కరోనా.. గంటకొక్కసారి శానిటైజ్‌ షురోనా.. అంటూ అద్భుతంగా పాడి వినిపించారు.