న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీలు చేసిన బడ్జెట్ పత్రాలను ఆర్థికశాఖ అధికారులు పార్లమెంటు భవనం వద్దకు తీసుకువచ్చారు. పోలీసు జాగిలాలతో బడ్జెట్ పత్రాలను తనిఖీలు చేశారు. నిర్మలాసీతారామన్ మరికొద్దిసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దృష్ట్యా ఆమె కుటుంబసభ్యులు పార్లమెంటుకు చేరుకున్నారు. సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ బడ్జెట్ పై ఓ శిల్పాన్ని ఇసుకతో రూపొందించారు. నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసివచ్చాక కేంద్రమంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
పార్లమెంటుకు వచ్చిన బడ్జెట్ పత్రాలు...