పార్లమెంటుకు వచ్చిన నిర్మలా సీతారామన్ కుమార్తె



న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు పార్లమెంటుకు తరలివచ్చారు. నిర్మలాసీతారామన్ కుమార్తె పరకాల వాజ్మయి కూడా పార్లమెంటు గ్యాలరీకి వచ్చారు. తల్లి ప్రవేశపెట్టే బడ్జెట్ ను వినేందుకు ఆమె కుమార్తె పరకాల వాజ్మయి రావడంతో పార్లమెంటు అధికారులు ఆర్థిక శాఖ మంత్రి కుటుంబసభ్యులను పార్లమెంటులోని సందర్శకుల గ్యాలరీలోకి తీసుకువెళ్లారు.